
గ్రామీణ యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం క్రీడాకారుల కోసం టాలెంట్ సెర్చ్ కార్యక్రమం చేపడుతోంది. దీనికోసం జగన్ సర్కార్ 9 సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. మరో రెండు సంస్థలతో అగ్రిమెంట్ కుదుర్చుకొనేందుకు చర్చలు కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు
- 1. చెన్నై సూపర్ కింగ్స్
- 2. ప్రో కడ్డీ లీగ్
- 3. పీవీ సింధు
- 4. ఆంధ్రా ఖో ఖో అసోసియేషన్
- 5. ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్
- 6. ఆంధ్రా వాలీబాల్ అసోసియేషన్
- 7.ప్రైమ్ వాలీబాల్ లీగ్
- 8. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్
- 9. ఏపీ బ్యాడ్మెంట్ అసోసియేషన్
ఈ సంస్థల నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా టాలెంట్ సెర్చ్ చేపట్టనున్నారు..
చర్చలు కొనసాగుతున్న సంస్థలు
- 1. ముంబై ఇండియన్స్
- 2. సన్ రైజర్స్ హైదరాబాద్ తో చర్చలు సాగిస్తున్నారు.
రాబోయే ఐపీఎల్, పీకేఎల్, పీవీఎల్ సీజన్స్ లలో ఏపీ క్రీడాకారులకు అవకాశాలు కలిపించే దిశగా చర్యలకు తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.